17 రోజుల్లో "ధమాకా" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రవితేజ తాజాగా ధమాకా అనే పక్కా మాస్ కమర్షియల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటించగా ... త్రినాధ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఇప్పటికి కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ధమాకా సినిమా ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 17 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

17 రోజుల్లో ధమాకా మూవీ నైజాం ఏరియాలో 17.18 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ... సీడెడ్ లో 6.82 కోట్లు , యు ఏ లో 1.76 కోట్లు ,  వెస్ట్ లో 1.23 కోట్లు ,  గుంటూరు లో 1.77 కోట్లు ,  కృష్ణ లో 1.70 కోట్లు ,  నెల్లూరు లో 93 లక్షలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 35.80 కోట్ల షేర్ ... 65.26 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 3.46 కోట్లు ,  ఓవర్సీస్ లో 2.64 కోట్లు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 41.90 కోట్ల షేర్ ,  78.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: