ఏజెంట్: అక్కినేని ఫ్యాన్స్ కి షాక్.. ?

Purushottham Vinay
మంచి స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. స్టైలిష్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు సురేందర్ రెడ్డి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు ప్రేక్షకుల్లో సపరేట్ క్రేజ్ ఉంది.అయితే తాజాగా సురేందర్ రెడ్డి షూటింగ్ లో గాయపడటం జరిగింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ అనే చిత్రాన్ని పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అఖిల్ ను చాలా డిఫరెంట్ గా ఇంకా చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేయనున్నారు సురేందర్ రెడ్డి. ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ ప్లేన్ చేస్తోన్న సమయంలో అనుకోకుండా గాయపడ్డారు సురేందర్ రెడ్డి. 


సురేందర్ రెడ్డి కాలికి తీవ్ర గాయమైనట్టు సమాచారం తెలుస్తోంది.వీల్ చైర్ లో సురేందర్ రెడ్డి కూర్చొని ఉండగా అతని కాలుకు పెద్ద కట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక సురేందర్ రెడ్డి దాదాపు స్టార్ హీరోలందరితో మూవీలు చేశారు. లాస్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో సైరా సైరా నరసింహారెడ్డిలాంటి పిరియాడికల్ డ్రామా తెరకెక్కించి ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి స్పై థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ ఎన్నో భారీ అంచనాలను పెంచేసింది.ఇప్పటికే సినిమా లేట్ అవుతూ వస్తుంది. పైగా డైరెక్టర్ కి ఇలా గాయం కావడం వల్ల సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుందని అక్కినేని అభిమానులు బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: