నేను అలా చేయడం వల్లే నన్ను ట్రోల్స్ చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మీక..!?

Anilkumar
పుష్ప వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది రష్మిక మందన. కానీ ప్రస్తుతం వరుస వివాదాలతో సాహసం చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈమె. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం రష్మిక మందన దక్షిణాది ప్రేక్షకుల నుండి కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. అయితే ఇటీవల రష్మిక మందన కాంతార సినిమా చూడలేదు అని చెప్పడంతో వివాదాలతో నిలుస్తూ వచ్చింది. దాని అనంతరం రష్మిక మందలను హీరోయిన్గా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరుకూడా చెప్పకుండా చేతులతో సైగ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

దీంతో కన్నడిగులు రష్మికపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో చాలామంది స్టార్ హీరోయిన్ అయ్యాక రష్మిక మందన కళ్ళు నెత్తికెక్కాయి అంటూ పలు రకాల కామెంట్లను చేశారు. సొంత పరిశ్రమను మర్చిపోయిందని రష్మికను కన్నడలో బ్యాన్ చేయాలి అని కూడా కన్నడిగులు డిమాండ్ చేసినట్లు గతంలో పలు రకాల వార్తలు రావడం జరిగింది. అయితే తాజాగా మిషన్ మజ్ను ఆడియో లాంచ్ లో రష్మిక మందన మాట్లాడుతూ దక్షిణాది చిత్రంలో కేవలం మసాలా సాంగ్స్ మాత్రమే ఉంటాయి.అసలైన రొమాంటిక్ సాంగ్స్ ఉత్తరాదిలో ఉంటాయని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయమై మరోసారి వివాదంలో నిలిచింది రష్మిక.

దీంతో చాలామంది నెటిజెన్స్ రష్మిక మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. ఇందుకుగాను చాలా దారుణంగా రష్మికను ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఈ వార్తలు పై స్పందించింది రష్మిక మందన. ఇందులో భాగంగానే తను మాట్లాడుతూ... తను ఓ నటి అని అందరికీ నచ్చకపోవచ్చు అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. అన్ని సమయాల్లో ప్రజలు తనను ఇష్టపడతారని నేను ఏమాత్రం దాని ఆశించడం లేదు... మేము హీరో హీరోయిన్లు అయినందుకు మమ్మల్ని ఇష్టపడాలని ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది... సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాము అంటే ఇష్టంతో పాటు ద్వేషం కూడా ఉంటుంది... మనం ఏదైనా మాట్లాడేటప్పుడు పబ్లిక్ మనల్ని ఇష్టపడడం ఇష్టపడకపోవడం మన చేతుల్లో లేదు... నేను మాట్లాడే విధానం చేతులతో అలా సైగలు చేయడం వల్ల బహుశా నేను ఇలాంటి నెగెటివిటీని ఎదుర్కొంటున్నానేమో... అది కొంతమందికి నచ్చకపోవచ్చు... దాంతోపాటు నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా కొందరికి నచ్చకపోవచ్చు ..అంటూ చెప్పుకొచ్చింది రష్మిక...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: