రజినీకాంత్ జైలర్ సినిమాలో మోహన్ లాల్..!!

Divya
సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం జైలర్.. ఒకరకంగా చెప్పాలి అంటే రజనీకాంత్ శంకర్ డైరెక్షన్ లో చేసిన రోబో సినిమా తర్వాత ఒక కమర్షియల్ హిట్ కూడా ఆయన ఖాతాలో పడలేదు. దీంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే ఈసారి కమర్షియల్ హిట్ సాధించాలన్న ఆలోచనలో చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మరి సినిమా కథను సెలెక్ట్ చేసుకుంటున్నారు రజినీకాంత్. ఈ క్రమంలోనే డాక్టర్, బీస్ట్ వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ ఈ జైలర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ బయటకి వచ్చింది.
కోలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మోహన్ లాల్ ను  సంప్రదించగా ఆయన కూడా ఓకే చెప్పడం జరిగిందట   ఈ నెలలో మోహన్లాల్ జైలర్ మూవీసెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అంతేకాదు ఈయన పాత్ర నిడివి 15 నిమిషాలు ఉంటుందని.. మరొకవైపు ఈ సినిమాలో కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.  ఇలా ఒక సినిమాలో మూడు ఇండస్ట్రీల కు సంబంధించిన సెలెబ్రిటీలు కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇకపోతే ఈ సినిమా షూటింగు ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది.  ఇటీవలే రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణన్,  వసంత్ రవి,  వినాయకన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి సెలవుల సందర్భంగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: