HBD Hebba Patel: హెబ్బా పటేల్ గురించి తెలియని కొన్ని రహస్యాలు ఇవే..!

Divya
ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కుమారి 21 ఎఫ్ చిత్రం ద్వారా గ్లామర్ షో ప్రదర్శించి రెండవ సినిమాతోనే యువతను తన వశం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కాలంలో కూడా మంచి సినిమాలలో అవకాశాలు అందుకుంది. 1989 జనవరి 6వ తేదీన మహారాష్ట్రలో జన్మించిన హెబ్బా పటేల్ 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా అనే చిత్రం ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ కన్నడంలో వచ్చిన అధ్యక్ష సినిమా మొదటిసారి విడుదలయ్యింది.

2014లో వచ్చిన అలా ఎలా? అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2016లో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా,  నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వంటి సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ 2017లో మిస్టర్ , అంధగాడు,  ఏంజెల్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది . అంతేకాదు అదే ఏడాది విన్నై తాండి వంద ఏంజెల్ అనే తమిళ చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హెబ్బా పటేల్ 2018లో 24 కిస్సెస్ సినిమాలో నటించినా.. ఆ తర్వాత 2020లో ఒరే బుజ్జిగా చిత్రంలో నటించినది.
అవకాశాలు లేక దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హెబ్బా పటేల్ 2022లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి అందరిని అలరించింది. మొదట్లో గ్లామరస్ పాత్రలతో బోల్డుగా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇలా ఈ చిత్రంలో డి గ్లామరస్ పాత్ర పోషించేసరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఈ సినిమాలో ఈమె నటనకు ఈమెకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఈరోజు ఆమె పుట్టిన రోజు కాబట్టి తన కెరీర్లో మునుముందు ఇలాంటి మంచి అవకాశాలు ఎన్నో అందుకోవాలని హెరాల్డ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: