అవతార్2: ఎట్టకేలకు రికార్డ్ కొట్టిందిగా?

Purushottham Vinay
వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజిలో సెన్సేషన్ ని రేపుతున్న సినిమా 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. గ్లోబల్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజిలో వసూళ్ల వర్షం కురిపిస్తుంది.జేమ్స్ కామెరూన్ 13 సంవత్సరాల క్రితం అనగా 2009 వ సంవత్సరంలో తీసిన ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.కానీ ఇపుడు అవతార్ 2 సినిమా అవతార్ 1 రికార్డులు బద్దలు కొడుతోంది.  ఇక ఇప్పటిదాకా నార్త్ అమెరికా సహా ఇండియా ఇంకా చైనా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 13000 కోట్ల దాకా వసూళ్లు సాధించింది. ఇక ఇండియాలో ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే  360 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. భారీ వసూళ్లతో చాలా వేగంగా దూసుకుపోతున్న ఈ సినిమా మొత్తం 400 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మితమైంది.

అలాగే ఇండియాలో అవేంజర్స్ సినిమా రికార్డులను కూడా అవతార్ 2 సినిమా బద్ధలు కొడుతోంది.ప్రపంచవ్యాప్తంగా  ఏకంగా 180 పైగా భాషలలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ వసూళ్లను రాబడుతూ క్రేజ్ తెచ్చుకోని బాగా  దూసుకుపోతుంది. ఇక ఇప్పటికి ఇండియాలో విడుదలయ్యి రికార్డు లెవెల్ లో వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాలను మించి ఈ సినిమా  భారీగా కలెక్షన్స్ రాబడుతుంది.తెలుగు రాష్ట్రాల్లో  ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లు సాధిస్తూ చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్ద పెద్ద తెలుగు సినిమాలకు పోటీగా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.ఇక అవతార్  పార్ట్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 30 వేల కోట్ల దాకా వసూళ్లు కొళ్లగొట్టి హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. ఇక అవతార్ 2 సినిమా ఆ వసూళ్ళని దాటడం ఖాయంగా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: