తునివు: సోలోగా రానున్న తునివు.. పక్కా ప్లాన్..!
మరొకవైపు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా జనవరి 13వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో అజిత్ తునివు సినిమాను సోలోగా విడుదల చేయాలని.. అందుకే జనవరి 11వ తేదీన పక్క ప్లాన్ వేసి మరీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ సినిమాను తెగింపు పేరిట విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. హెచ్. వినోద్ దర్శకత్వంలో బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ నాచురల్ లుక్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నైజాం, వైజాగ్ ఏరియాలతోపాటు ప్రాధాన్యత ఉన్న థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఒకపక్క విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాకి కూడా ఈయనే నిర్మాత కావడం గమనార్హం. చిరంజీవి ,బాలకృష్ణ సినిమాలకు థియేటర్ లు ఇవ్వకుండా విజయ్ వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్ లు కేటాయించడమే కాకుండా ఇప్పుడు తెగింపు సినిమాని కూడా ఇక్కడ రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు దీన్నిబట్టి చూస్తే కక్షపూరితంగానే చిరంజీవి , బాలకృష్ణకు థియేటర్ లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరి వీటిలో ఏవి విజయం సాధిస్తాయో చూడాలి.