ఎన్టీఆర్ 30 సినిమా గురించి షాకింగ్ న్యూస్ రివీల్ చేసిన కొరటాల..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాదు ఉన్న వార్త విన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో హర్ట్ అయ్యారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కోసం వచ్చే ఈడాది ఏప్రిల్ 5 వరకు ఆగాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న కొరటాల శివ తాజాగా తిరుమల కు రావడం జరిగింది. ఇందులో భాగంగానే అక్కడి మీడియాతో మాట్లాడారు కొరటాల శివ. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలను కూడా చెప్పవచ్చాడు.

 కొరటాల మాట్లాడుతూ ఎన్టీఆర్ 30 సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆ దేవుడిని కోరుకున్నాను అని.. ఫిబ్రవరి నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని.. గ్రాండ్ గా ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతామని.. 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు కొరటాల. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా రిలీజ్ చేయడం కాస్త ఆలస్యం అవుతుందని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం వెకేషన్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తిరిగి వచ్చిన అనంతరం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ను

 మొదలుపెట్టనున్నారు అని తెలుస్తుంది. దీంతో చాలామంది వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ సినిమాతో సరికొత్త రికార్డును క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు కొరటాల శివ. ఇదిలా ఉంటే ఇక ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా కి సంబంధించిన షూటింగ్ కూడా ఈ ఏడాదే మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ త్వరగా సినిమాలు మొదలుపెడితే బాగుంటుందని భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: