పెళ్లి చేసుకోబోతున్నాం.. అంటూ అందరిని మోసం చేసిన పవిత్ర-నరేష్..!?

Anilkumar
సీనియర్ నటుడు నరేష్ మరియు నా పవిత్ర లోకేష్ జంటపై సోషల్ మీడియా వేదికగా ఎన్ని రకాల పుకార్లు వస్తాయో మనందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈ జోడి త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అని ఇప్పటికే వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు అని వీరిద్దరికీ సంబంధించి అనేక రకాల వార్తలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే గతంలో తన మూడో భార్యతో విడాకులు తీసుకోకుండానే పవిత్రతో ఎఫైర్ కొనసాగిస్తున్నారని తన మూడో భార్య నరేష్ పై గతంలో ఆరోపణలు చేయడం జరిగింది. అయితే తాజాగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నరేష్ మరియు పవిత్రలోకేష్ ఎవరు ఊహించిన విధంగా 

లిప్ లాక్ ఫోటోతో ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని తమ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ పెళ్లి అని ప్రకటన పవిత్ర నరేష్ ఒక వీడియోను షేర్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియో చూసినా అనంతరం చాలామంది ఈ విషయం నిజమా అంటూ అనేక కామెంట్లను చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ విషయం నిజమా అని చుస్తే..  ఎవరు ఊహించిన విధంగా ఇదంతా పబ్లిసిటీ కోసమే అని ఈ జంట నటిస్తున్న మళ్లీ పెళ్లి అని సినిమా ప్రమోషన్ భాగంగానే వీరిద్దరూ తమ సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ ను షేర్ చేశారు అని తేలిపోయింది.

ఈ రోజుల్లో పుకార్లతో పబ్లిసిటీని ఏ విధంగా తెచ్చుకోవచ్చో మరోసారి రుజువు చేశారు ఈ జంట. దీంతో వారిద్దరూ కలిసి నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమాకి వీరికి కావలసినంత ప్రమోషన్ మరియు పబ్లిసిటీ దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో వీరిద్దరికీ సంబంధించి ఒక బయోపిక్ విడుదల కానుంది అన్న వార్తలు సైతం రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక ఒక రియాలిటీ స్టోరీ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని వారి సంబంధాన్ని ఎలివేట్ చేసే కథ లో వీరిద్దరూ నటిస్తున్నారని.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వరకు కూడా పూర్తయిందని తెలుస్తోంది. అసలు ఈ జంట పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా కొన్ని సినిమాలలో నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: