బడా బిజినెస్ మెన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్రీముఖి.. మరి పెళ్లి..!?

Anilkumar
బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గత కొంతకాలంగా ఎవరికి తెలియకుండా ఎఫైర్ నడిపిస్తుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది శ్రీముఖి పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుందని వార్త సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం యాంకర్ శ్రీముఖి హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మాన్ ని ప్రేమిస్తుందట. చాలాకాలంగా సీక్రెట్ గా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఫిలిం సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ..

 ప్రస్తుతం మీడియా వర్గాల్లో ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక శ్రీముఖి పెళ్లి చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మాన్ అట కొన్ని కోట్ల ఆస్తికి వారసుడైన బిగ్ షాట్ ని శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందట. ఇక ప్రస్తుతం శ్రీముఖి కెరియర్ విషయానికొస్తే ఆమె కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే బుల్లితెరపై అర డజను కు పైగా షోలలో ఆమె యాంకరింగ్ చేస్తోంది. ఈ మధ్య స్టార్ మా లో బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షోలో కూడా యాంకర్ గా చేస్తోంది. దీనికంటే ముందు డాన్స్ ఐకాన్ పేరుతో ఆహా ఓటీడీలో ప్రసారమైన డాన్ షోలో ఏకంగా జడ్జిగా వ్యవహరించింది ఈ బుల్లితెర యాంకర్. ఇక ఈ డాన్స్ షోలో శ్రీముఖి రచ్చ మామూలుగా లేదు.

ముఖ్యంగా ఈ డాన్స్ షో కోసం శ్రీముఖి వేసుకున్న బట్టలు టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారాయి. ఈ షో కోసం శ్రీముఖి ఏకంగా తన గ్లామర్ షోలో బౌండరీలు దాటేసి తన బోల్డ్ నెస్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళింది. అలా ఈ మధ్యకాలంలో శ్రీముఖి బాగా పాపులాటను దక్కించుకొని షోలతో యాంకర్ గా దూసుకెళ్తోంది. ఒకప్పుడు చూసుకుంటే శ్రీముఖి యాంకరింగ్ లో టాప్ ఫైవ్ లో ఉండేది. ఇక ప్రస్తుతానికి షోల పరంగా ఆమె నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఎందుకంటే ఈమధ్య మన అగ్ర యాంకర్ సుమ చేస్తున్న షోలకంటే శ్రీముఖి ఎక్కువ షోలు చేయడం గమనార్హం.  ప్రస్తుతం కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే శ్రీముఖి ప్రేమలో ఉందనే వార్త బయటకు రావడంతో త్వరలోనే ఆమె బడా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. ఇక శ్రీముఖి పెళ్లికి సంబంధించి పూర్తి స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: