హిందీలో సూర్య సినిమాకి భారీ బిజినెస్.. షూటింగ్ పూర్తవ్వకముందే అన్ని కోట్ల డీలా..?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సౌత్ సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. అంతేకాదు ఈ సినిమాలకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. అయితే వీటి తర్వాత సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయాయి. సూర్య నటించిన చివరి చిత్రం 'ఈటి' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. సినిమాలో కంటెంట్ బాగున్నా దాన్ని తీర్చిదిద్దిన విధానంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సూర్య ఆశలన్నీ తాను తాజాగా శివ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ పైనే ఉన్నాయి.

ఇక ప్రస్తుతం ఈ పీరియాడిక్ మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలై సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతుంది. నిజానికి సినిమాలపరంగా హీరో సూర్య గ్రాఫ్ ఎలా ఉన్నా ఈ సినిమాకి మాత్రం భారీ రేంజ్ లోనే బిజినెస్ జరుగుతుందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ థియేట్రికల్ అండ్ నాన్ ధియేట్రికల్ రైట్స్ దాదాపు 100 కోట్లకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రేంజ్ లో సూర్య సినిమాకి హిందీలో బిజినెస్ జరగడం అనేది విశేషం అని చెప్పాలి.

ఇక సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాని ఏకంగా 10 భాషల్లో విడుదల చేస్తున్నారు. అంతేకాదు 2Dతోపాటు 3D లో కూడా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో సూర్యకు జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: