'రవితేజ అన్న నన్ను క్షమించండి నోరు జారీ అలా అన్నా': షకలక శంకర్

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవి తేజ ఇటీవల ధమాకా సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈయన హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్ర బృందం.ఇందులో భాగంగానే పిలువకపోయినా ఈ సక్సెస్ మీట్ కి బండ్ల గణేష్ హాజరయ్యారు. ఇక ఆ ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ సూపర్ స్టార్స్ మరియు మెగాస్టార్సపై కొన్ని కొన్ని కామెంట్లను కూడా చేయడం జరిగింది. దీనికిగాను జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ స్పందించాడు. బండ్ల గణేష్ మాట్లాడినందుకుగాను రవితేజకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను షేర్ చేశాడు షకలక శంకర్. 

దీంతో ఈ వీడియో చూసిన వారందరూ షకలక శంకర్ రవితేజకు ఎందుకు క్షమాపణలు చెప్పాడు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా షకలక శంకర్ నటించిన రాజయోగం సినిమా విడుదలైంది. ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా  మాట్లాడుతూ ఒక హీరోని వాడు వీడు అని సంబోధించాడు. దీంతో చాలామంది ఈయన ఎవరిని ఉద్దేశించి అలా అన్నాడు అని ఆరా తీస్తే... షకలక శంకర్ ధమాకా ప్రెస్ మీట్ లో పాల్గొన్న బండ్లను మరియు రవితేజను తన మాటలతో నోరు జారినట్లుగా తెలుస్తోంది. 

అయితే ధమాకా ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. అందరూ రెండుమూడు ఏళ్ళు ట్రై చేసి అదృష్టం కలిసి వచ్చి సూపర్ స్టార్లు మరియు మెగాస్టార్లు అయిపోతూ ఉంటారు అని..  రాజయోగం ప్రమోషన్ లో బండ్ల గణేష్ మాటలపై శంకర్ మాట్లాడుతూ మొన్న ఒక ప్రొడ్యూసర్ ఇలా అన్నాడు... 
రెండు మూడేళ్లకే అదృష్టం కలిసి వచ్చి సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయిపోతారని వాళ్ళు రెండు మూడేళ్లు కష్టపడితే అలాంటి స్టార్లు కాలేదు అని ఎన్నో ఏళ్ళు కష్టం పడితే వాళ్లకి ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందని శంకర్  చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వార్త తెలిసిన చాలామంది రవితేజను ఎవడు అని అంటావా అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో ఈ మాటలకి స్పందించిన షకలక శంకర్ ఒక వీడియో ద్వారా ఫ్లోలో మిమ్మల్ని కూడా వాడు అనేసాను సర్ వీలైతే నన్ను క్షమించండి రవితేజ ఫ్యాన్స్ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: