అఖిల్ అసలు మ్యాటర్ అర్ధం కావట్లేదు..!

shami
అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత ఏజెంట్ అనే సినిమా మొదలు పెట్టాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి సినిమా చేస్తున్నాడు కానీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. అసలైతే 2022 డిసెంబర్ లో సినిమా రిలీజ్ అనుకున్నారు కానీ అది జరగలేదు. 2023 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు. ఇప్పుడు అది కూడా మిస్ అయ్యింది. ఏజెంట్ సినిమా లో అఖిల్ యాక్షన్ హీరోగా కనిపిస్తాడని తెలుస్తుంది.
సినిమా నుంచి న్యూ ఇయర్ సందర్భంగా మరో యాక్షన్ సీన్ మేకింగ్ వీడియో చూపించారు. ఈ హడావిడి అంతా బాగానే ఉంది కానీ అసలు అఖిల్ ఏజెంట్ ఎప్పుడు వస్తుంది అన్నది అర్ధం కావట్లేదు. తన బాడీ షేప్ లతో అమ్మాయిలకు నిద్ర పట్టకుండా చేస్తున్న అఖిల్ బాడీ మీద పెట్టిన ఫోకస్ ఏదో సినిమా రిలీజ్ మీద పెడితే బాగుంటుందని అంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఏజెంట్ రిలీజ్ ఎప్పుడు అని అడిగి అడిగి విసుగు వచ్చేసింది.
అఖిల్ ఏజెంట్ సినిమాని సురేందర్ రెడ్డి చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా యాక్షన్ ప్రియులకు ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. అఖిల్ ఏజెంట్ మాస్ ట్రీట్ అందించాలని చూస్తున్నారు. మరి అఖిల్ ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. ఏజెంట్ ఈ వీడియో మెరుపులు బాగానే ఉన్నాయి కానీ ఎన్నాళ్లని సినిమాని రిలీజ్ చేయకుండా ఉంటారు. త్వరగా రిలీజ్ చేయండి బాసు అంటూ ఆడియన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. అఖిల్ ఏజెంట్ హిట్ పడితే మాత్రం అక్కినేని హీరో రేంజ్ మారినట్టే అని చెప్పొచ్చు. ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: