ఆ బడా ప్రాజెక్ట్ నుండి సమంత అవుట్..?

Anilkumar
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంతకి మయోసైటిస్ అనే కండరాల వ్యాధి ఉంది. ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆమె నటించిన యశోద సినిమా కంటే ముందే ఈ వ్యాధితో బాధపడుతుంది సమంత. ఆ తర్వాత పరిస్థితి మరి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే సమంత ఆరోగ్యం పై అనేక రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. ఇటీవల తన ఆరోగ్యం మరింత క్షిణించిందని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. అయితే ఆ వార్తలన్నింటినీ సమంత కుటుంబ సభ్యులు సన్నిహితులు కొట్టి పారేశారు.

 ప్రస్తుతం సమంత కోలుకుంటుందని వాళ్ళు వెల్లడించడమే కాకుండా త్వరలోనే ఆమె సినిమాలు కూడా చేస్తుందని చెప్పారు. అయితే తాజాగా సమంతకు సంబంధించిన మరో సమాచారం బయటికి రావడంతో ఆమె ఆరోగ్యం పై మరోసారి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా సమంత ఓ బాలీవుడ్ బడా ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రెస్ట్ తీసుకుంటున్న సమంత ఇప్పటికీ తన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కొన్ని సినిమాల నుంచి తప్పుకోవాలని భావిస్తోందని సమాచారం.ఈ నేపథ్యంలోనే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ బడా ప్రాజెక్టు ఫ్యామిలీ మెన్ టు తర్వాత సమంత మరో బాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ని ఓకే చేసిన విషయం తెలిసిందే.

ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ డీకే ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ వెబ్ సిరీస్ రన్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అనారోగ్య కారణాలవల్ల సమంత ఈ వెబ్ సిరీస్ నుండి తప్పకుండాట్లు జాతీయ మీడియా నుంచి కథనాలు వస్తున్నాయి. అందుకు కారణం ఇటీవల డాక్టర్లు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకోవాలని సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ వార్తపై మరింత క్లారిటీ అయితే రావాల్సి ఉంది.ఇక సమంత ప్రస్తుత సినిమాల విషయానికొస్తే ఆమె టాలీవుడ్ లో నటించిన శాకుంతలం అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: