ఖుషి రీ-రిలీజ్ కలెక్షన్స్..మొత్తం ఎంతంటే?

Satvika
పవన్ కళ్యాణ్ సినిమా అంటే క్రేజ్ మామూలుగా వుండదని మరోసారి నిరూపితం అయ్యింది.. ఆయన కొత్త సినిమాలు మాత్రమే కాదు పాత సినిమాలు కూడా ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాయి..అందుకు ఉదాహరణగా ఖుషి సినిమా చెప్పొచ్చు..ఈ చిత్రం డిసెంబర్ 31 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది.ఒక్కరోజులో ఈ సినిమాకి వచ్చినటువంటి వసూళ్లు చాలా మంది స్టార్ హీరోలకు మొదటి రోజు కూడా రావు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..


ప్రముఖ హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది.. సిటీ లో ఉన్న ప్రతీ థియేటర్ లో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని అందుకుంది.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్, కలెక్షన్స్ మరే సినిమాకు రాలేదని తెలుస్తుంది..నైజాం ప్రాంతం లో మొదటి రోజు దాదాపుగా కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.. గతంలో 'జల్సా' స్పెషల్ షోస్ ఈ ప్రాంతం లో కోటి 23 లక్షలకు పైగా వసూళ్లను రాబట్టింది..ఆ తర్వాత పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యినప్పటికీ ఏ సినిమా ఈ రికార్డ్సు ను దాటలేదు.. మళ్ళీ పవన్ కళ్యాణే తన రికార్డుని తానే బద్దలు కొట్టాడు..భవిష్యత్తులో ఈ రికార్డు ని ఎవ్వరు టచ్ చెయ్యలేరు కూడా..ఇక సీడెడ్ లో అయితే ఈ చిత్రం చరిత్ర తిరగరాసింది.


విడుదలైన ప్రతీ చోట కాసుల కనకవర్షం కురిపించిన ఈ చిత్రానికి మొదటి రోజు అక్కడ 60 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం..ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో 40 లక్షలు , ఈస్ట్ గోదావరి జిల్లాలో 20 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 15 లక్షలు, గుంటూరు సిటీ 45 లక్షలు ఇలా అన్నీ చోట్ల మంచి కలెక్షన్స్ ను రాబట్టింది..అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజిగా ఉన్నారు..అవి వచ్చే ఏడాది విడుదల కానున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: