ఎన్టీఆర్, బన్నీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ కు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వీరి నుంచీ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారంటే.. దర్శక నిర్మాతలకు అభిమానులు వార్నింగ్ ఇచ్చే స్టేజికి కూడా ఎదిగిపోయారు. కానీ నిర్మాణ పనుల కారణంగా సినిమాలు వాయిదా పడుతూ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2021 డిసెంబర్లో విడుదలైన అల్లు అర్జున్ పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికీ అదే మేనియా కొనసాగిస్తుంది.

అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ నాటి నుంచి నేటి వరకు అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని విడుదల చేయలేదు.  గత ఏడాది ఎలాగో విడుదల చేయలేదు కాబట్టి ఈ ఏడాది విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాలి. అయితే ఇప్పుడు ఈ ఏడాది కూడా విడుదల చేసే అవకాశం లేదని తెలిసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరొక ఒక్క ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది మార్చిలో విడుదలై ఇప్పటికీ అదే జోష్లో కొనసాగుతోంది. కానీ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక సినిమా కూడా విడుదల కాలేదు.
ఇప్పటికే  కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతుందని చెప్పారు కానీ ప్రకటించలేదు. న్యూ ఇయర్ సందర్భంగా ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పి వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తామని చెప్పారు . దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది అల్లు అర్జున్ , ఎన్టీఆర్ సినిమాలు విడుదల లేనట్లే అని తెలిసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాది లేకపోయేసరికి కేవలం వారి అభిమానులు మాత్రమే కాదు ఇతర సినీ ప్రేక్షకులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఈ ఏడాది వీరి నుంచి సినిమాలు రాకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: