వాల్తేరు వీరయ్య పాటపై వివాదం.. అసలెంజరిగిందంటే..!?

Anilkumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ ఒక కీలక పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్లు మరియు పోస్టర్లో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.దీంతో వీరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక పాట ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్

 ఈ పాటకి సంబంధించి చేసిన కొన్ని కామెంట్లు కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.అయితే ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.." అసలు ఈ పాట రాసింది ఎవరు.. ఈ పాట రాసిన వాడికి అసలు పురాణాల కథల గురించి తెలుసా.. అసలు అతడు ఏం చదువుకున్నాడు.. అసలు ఆయనకి తిమిరం అంటే అర్థం తెలుసా.. ఇది శివ దూషణ కాదా.. అసలు ఏమిటి ఈ పిచ్చి రాతలు.. తెలుగు సినీ కవిత్వం వేటూరి మరణంతో మసకబారీ దీపమైంది.. ఇక సిరివెన్నెల మరణం ఆ కాస్త దీపాన్ని ఆర్పేసింది.." అంటూ యండమూరి ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

దీనికిగాను ఈ పాట రాసిన చంద్రబోస్ స్పందించడం జరిగింది. ఎందుకు ఈ పాటలో ఆ పదాలని ఆయన రాసాడో వివరించాడు. తను దూషణ చేయలేదు అని.. ఈ సినిమాలోని హీరో పాత్ర స్వభావాన్ని ఈ పాటలో ప్రతిబింబించేలా ఆ పదాలను రాశారని.. ఇక చిరంజీవి సత్యానంద్ ఈ పాట విన్న అనంతరం చాలా బాగుందని.. ఇది అధ్యయనం చేయాల్సిన పాట అని.. కూడా తెలిపారు. దాంతోపాటు యండమూరి చేసిన విమర్శలకి తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చాడు. నిజానికి అభినందనలు తెలిపాల్సిన ఈ సాహిత్యానికి విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు చంద్రబాబు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: