చిరంజీవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఊర్వశి రౌటేలా...!!
సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుందని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.. సంక్రాంతి కానుక గా 2023 జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య టీం తొలిసారి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా బాస్ పార్టీ సాంగ్ లో మెరిసిన ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలో కి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ సాంగ్‌తో నా డెబ్యూ ఇస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌజ్‌లో నటించే అవకాశమిచ్చిన నిర్మాతలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. చిరంజీవి గారితో పనిచేశాక ఆయన సూపర్ స్టార్ కాకుండా మెగాస్టార్ ఎందుకయ్యారో ఇప్పుడు తెలిసింది.
బాస్ పార్టీ సాంగ్ పూర్తి చేసినపుడు నాలుగేండ్ల కిందటి సైమా క్లిప్పింగ్ ను నేను చూశా. మీరు ఎవరితో పనిచేయాలని ఎక్జయిటింగ్ గా ఉన్నారని ఓ జర్నలిస్ట్ నన్ను ఒక ప్రశ్న అడిగారు. నేను చిరంజీవి సార్ తో అని చెప్పాను. సెట్స్ లో ఉన్నపుడు చిరంజీవి సార్‌తో పనిచేస్తున్నానా అని చాలా సార్లు షాకయ్యా. నేను చాలా మంది సూపర్ స్టార్లతో కలిసి నటించాను. కానీ మొదటిసారి మెగాస్టార్ తో నటించా అని చాలా చాలా హ్యాపీగా ఉంది అని ఊర్వశి చెప్పుకొచ్చింది.. కానీ రవితేజ మాతో ఈ పాటలో లేడు. భవిష్యత్‌లో రవితేజ గారితో కూడా కలిసి నటిస్తానని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చిందట ఊర్వశి రౌటేలా