'నా శ్వాస ఉన్నంత వరకు ప్రేమించేది నిన్ను మాత్రమే'.. సుధీర్ ఎమోషనల్ పోస్ట్..?

Anilkumar
బుల్లితెరపై కమెడియన్గా, యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన  గుర్తింపును తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కమెడియన్గా యాంకర్ గానే కాకుండా సుధీర్ రష్మితో నడిపించే లవ్ ట్రాక్ వల్ల ఎంతో పాపులారిటీని దక్కించుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో వీరిద్దరినీ చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందా అని 100 రకాల ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ వీరిద్దరూ ఆ విషయాలపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అంతేకాదు వీరిద్దరి ప్రేమ మరియు పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా అనేక రూమర్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. 

చాలా సార్లు వీరిద్దరూ పలు షోలలో వివాహం కూడా చేసుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈయన. ఇక ఇందులో భాగంగానే అనేకమైన విషయాలను పంచుకున్నాడు సుడిగాలి సుదీర్. ఇక సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుడిగాలి సుధీర్ కి అమ్మానాన్నలు, తమ్ముడి అతని భార్య వీరందరూ కలిసి ఉంటారు. అయితే సుధీర్ తమ్ముడికి సెప్టెంబర్ లో ఒక పాప పుట్టింది. అందుకుగాను ఆ పాపకి సంబంధించిన ఒక పోస్టును తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. సుధీర్ అందులో భాగంగానే సుధీర్ కింద క్యాప్షన్ రాస్తూ నా శ్వాస ఉన్నంతవరకు నేను ప్రేమించేది నిన్ను మాత్రమే అంటూ ఆ ఫోటోను షేర్ చేసాడు.

ప్రస్తుతం సుధీర్ బుల్లితెరకు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా అనంతరం హీరోగా తన కెరీర్ను కంటిన్యూ చేయనున్నాడు సుడిగాలి సుధీర్. కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా తన టాలెంట్ను ఈ సినిమాతో బయటపెట్టాడు సుడిగాలి సుదీర్. కామెడీ తో పాటు ఈయన మ్యాజిక్ కూడా చేస్తాడు అని మనందరికీ తెలిసిందే. గాలోడు సినిమా అనంతరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సుదీర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: