బాలయ్య, చిరు ల డాన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శేఖర్ మాస్టర్..?

Anilkumar
చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో త్వరలోనే తెరకెక్కనున్న వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో త్వరలోనే తెరకెక్కనున్న వీరసింహారెడ్డి సినిమాలు రెండు కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి సినిమాలోని అన్ని పాటలకు మరియు బాలకృష్ణ సినిమాలోని రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఈ సినిమాలకి సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఈయన. 

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రెండు సినిమాలో ఒకేసారి విడుదల అవుతాయని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమాలోని పాటలకి కొరియోగ్రఫీ చేసినప్పుడు నాకు పెద్దగా టెన్షన్ అనిపించలేదు. కానీ ఈ సినిమాలు రెండు ఇప్పుడు ఒకేసారి విడుదల అవుతాయి అని తెలిసిన అనంతరం కొంచెం టెన్షన్ గా ఉంది. అంతేకాదు దాంతో పాటు ఎంతో సంతోషంగా కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్. అందులో భాగంగానే శేఖర్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి నాకు ఒక ఊహించని పెద్ద పండుగ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక నేను కొరియోగ్రఫీ అందించిన ఈ రెండు సినిమాల్లోని కొన్ని డాన్స్ మూమెంట్లు రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. నేను కొరియోగ్రఫీ అందించిన పాటలను ఎంతో వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక నేను కొరియోగ్రఫీ అందించిన ఈ సినిమాలోని పాటల్లోని కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ వల్ల కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందని దీంతోపాటు సిగ్నేచర్ స్టెప్స్ వల్ల కూడా సినిమా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నా సిగ్నేచర్ స్టెప్స్ ని నేను నా కెరియర్ మొదలుపెట్టినప్పటి నుండి ఫాలో అవుతున్నాను. అందుకే వీటిపై నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను అంటూ చెప్పవచ్చాడు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం నేను రవితేజ గారి రావణాసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాను అంటూ తెలిపాడు శేఖర్ మాస్టర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: