సంచలనం సృష్టిస్తున్న అవతార్ 2 కలెక్షన్స్..!

Divya
డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 180 కి పైగా భాషల్లో ఘనంగా విడుదలైన చిత్రం అవతార్ 2. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రారంభంలో ఓపెనింగ్స్ పరంగా నిరాశపరిచినప్పటికీ ఫుల్ రన్ లో మాత్రం స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. పైగా నిన్న క్రిస్మస్ హాలిడే కూడా కావడంతో చాలామంది థియేటర్లకు వెళ్లి కుటుంబంతో సహా సినిమాను వీక్షించారు. కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా 80 వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. వాస్తవానికి అవతార్ వంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ కాబట్టి వన్ బిలియన్ మార్కును కేవలం మూడు రోజుల్లోనే అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ 10 రోజులకు ఆ మార్కుకు దగ్గరగా వచ్చింది.
ముందుగా తెలుగు రాష్ట్రాలలో వచ్చిన వసూళ్ళను పరిశీలిస్తే.. నైజాం ప్రాంతంలో ఈ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  అక్కడ 3D,4DX, ఐమాక్స్ స్క్రీన్స్ ఉండడం వల్లే అక్కడ ప్రజలు ఈ సినిమాను బాగా వీక్షించారు అని సమాచారం.  ఇకపోతే పది రోజులకు గాను ఈ సినిమాకి ఒక నైజాంలోనే 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో రూ.22 కోట్లు.. సీడెడ్ లో రూ.7కోట్లు 20 లక్షల రూపాయలు రాబట్టింది మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 64 కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులు చేసిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ ను అందుకోబోతోంది అనడంలో సందేహం లేదు.
నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి . 10 రోజులకు గాను నార్త్ లో  140 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే కర్ణాటకలో రూ.39 కోట్లు,  కేరళలో రూ.20 కోట్లు , కర్ణాటకలో రూ.39 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం.  ఇప్పటివరకు ఇండియా మొత్తం మీద 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ అయినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: