పనీపాటా లేకుండా అలాంటి పని చేసే వాళ్లను నేను పట్టించుకోను... మంచు లక్ష్మి..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ... ఆ తర్వాత తన ప్రతిభతో ఎన్నో సినిమా అవకాశాలను దక్కించుకొని ... ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు లక్ష్మి మొదటగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనగనగా ధీరుడు అనే మూవీలో ప్రతినాయక పాత్రలో నటించి , ప్రేక్షకులను మెప్పించింది.

ఈ మూవీలో సిద్ధార్థ్ హీరోగా నటించగా ... శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లోని మంచి లక్ష్మీ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా అనేక టీవీ షో లకు మరియు "ఓ టి టి" షో లకు హోస్ట్ గా వ్యవహరించి కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా లక్ష్మి సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చే ట్రోల్స్ పై ఘాటుగా స్పందించింది.

ఎలాంటి పని పాట లేకుండా కామెంట్ చేసే వాళ్లను నేను అస్సలు పట్టించుకోను అని లక్ష్మి చెప్పుకొచ్చింది. నేను మాట్లాడే విధానం పై చాలా మంది విమర్శలు చేస్తుంటారు అని ... వాళ్ళు నాల అస్సలు ఉండలేరు కాబట్టే నన్ను అలా అవహేళన చేస్తున్నారు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. భూమ్మీద పుట్టినందుకు ఏదైనా గొప్పగా చేయాలి అని అనుకుంటున్నాను ... అందుకు అనుగుణంగానే విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా లక్ష్మి చెప్పింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా లక్ష్మి సినిమాలతో ... టీవీ మరియు "ఓ టి టి" షో లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: