ఈ వారం ఓటీటీ లో విడుదల కానున్న సినిమాలు ఇవే..

Satvika
థియెటర్లలో విడుదల అయిన సినిమాల కన్నా ఓటీటీ లో విడుదల అయిన సినిమాలు భారీ క్రేజ్ తో పాటు మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి.థియెటర్లలో లాగే ఓటీటీ లో కూడా ప్రతి వారం సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే..కొందరు సినీ అభిమానులు ఓటీటీ లో విదుదలవుతున్న సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా, ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చేందుకు సినిమాలు సిద్దమయ్యాయి..ఈ వారం ఓటీటీ లో విడుదల అవుతున్న సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం:


సీనియర్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఏఆర్ మోహన్ తెరకెక్కించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. నవంబర్‌ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. డిసెంబర్ 23 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.


మసూద:


ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘మసూద’. ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయం కాగా.. సంగీత, తిరువీర్, బాంధవి శ్రీధర్ తదితరులు కనిపించారు.. నవంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది..అక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి..


లవ్ టుడే:


ఈ తమిళ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం రూ. 5 కోట్ల వసూల్ ను కలెక్ట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. అయిథె.. నవంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీల్లో అలరించేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈరోజు రాత్రి నుంచి లవ్ టుడే తెలుగు వర్షన్ రానుంది..


రామ్ సేతు:


అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'రామ్‌ సేతు'. రామ్‌ సేతు కథాంశం నేపధ్యంలో సాగే ఈ అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా జనాలను పెద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇందులో హీరో సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించగా.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది..


వీటితో పాటు అమలా పాల్ నటించిన టీచర్,’థ్యాంక్‌ గాడ్’ మొదలగు సినిమాలు కూడా విడుదల కానున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: