హీరో కావాలనుకున్న కైకాల.. విలన్ గా ఎలా మారాడో తెలుసా?

praveen
కైకాల సత్యనారాయణ.. ఈ పేరుతెలుగు ప్రేక్షకులు మరువ లేనిది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన నటనతో ఏకంగా చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి హావభావాలు పండించడంలో ఆయన తర్వాతే ఇంకెవరైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక అలాంటి కైకాల సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసారు. దీంతో ఇక తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు ఇక ఆయన మృతిపై స్పందిస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

 కైకాల సత్యనారాయణ ఎక్కువగా విలన్ పాత్రలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక రియల్ లైఫ్ లోను ఆయన విలన్ గానే ఉంటారేమో అనేంతల తన పాత్రలతో  ఆడియన్స్ మదిలో ముద్ర వేసుకున్నారు. కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో కైకాల నటించిన విలన్ పాత్రలు చూసిన తర్వాత నిజజీవితంలో కూడా ప్రేక్షకులు ఆయనను చీదరించుకునేవారు అంటే ఇక ఆయన విలన్ పాత్రలో ఎంతలా ఒదిగిపోయేవారో అర్థం చేసుకోవచ్చు  పాత్రలతో సరిపెట్టుకోకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హాస్యనటుడిగా కూడా ఎన్నో వందల సినిమాల్లో నటించారు.

 ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా ఉన్న కైకాల సత్యనారాయణ కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డారట. అక్కినేని నాగేశ్వరరావు కాలేజీగా పిలవబడే గుడివాడ కాలేజీలో కైకాల చదువుతున్నప్పుడు ఇక అక్కినేని నటించిన నాటకాన్ని చూసినప్పుడే కైకాల కు సినిమాల్లోకి రావాలని ఆశ పుట్టిందట. మద్రాసు వచ్చి ఒక నెల రోజులపాటు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అక్కడ ఎల్వి ప్రసాద్ ను కలవగానే నీకు నటుడయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయని ఆయన చెప్పడంతో కైకాల ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. మా సినిమా  మొదలు పెట్టడానికి మాత్రం రెండు నెలల సమయం పడుతుందని చెప్పి ఇక కైకాలను వెనక్కి పంపించారట ఎల్వీ ప్రసాద్. కానీ ఇక విఠలాచార్య సినిమాలో విలన్ గా అవకాశం వచ్చింది. ఇక ఆ తర్వాత సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు కైకాల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: