ఒక్కడు మూవీ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో హీరోగా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా మహేష్ బాబు కెరియర్ లో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన మూవీలలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు మూవీ ఒకటి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ 2003 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించింది.

ఈ మూవీ లో మహేష్ బాబు సరసన భూమిక చావ్లా హీరోయిన్ గా నటించగా , టాలెంటెడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ఓబుల్ రెడ్డి అనే విలన్ పాత్రలో నటించాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయ్యి వచ్చే సంవత్సరానికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇలా ఈ మూవీ 20 సంవత్సరాలను పూర్తి చేసుకాబోతున్న సందర్భంగా ఈ మూవీ ని 4 కే వర్షన్ తో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఒక్కడు మూవీ 4 కే వర్షన్ ను జనవరి 7 వ తేదీన థియేటర్ లలో చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించి మరో అద్భుతమైన అప్డేట్ ప్రకటించింది. ఒక్కడు మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ ను డిసెంబర్ 24 వ తేదీన సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు ఒక్కడు మూవీ 4 కే వర్షన్ రీ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: