మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పూర్ కలెక్షన్లను వసూలు చేసిన "లాఠీ" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ తాజాగా లాఠీ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విశాల్ కు భార్యగా సునైనా నటించింది. ప్రభు ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించగా , యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 22 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

ఈ మూవీకి విడుదల అయిన మొదటి రోజు ... మొదటి షో కే ఫస్ట్ ఆఫ్ సో ... సో ఉన్నప్పటికీ ... సెకండ్ హాఫ్ లో వచ్చే ఆఖరి 45 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ మాత్రం సూపర్ గా ఉన్నట్లు టాక్ వచ్చింది. అలా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సెడ్ టాక్ లభించడంతో మొదటి రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన మేరా కలెక్షన్ లు లభించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం 65 లక్షల గ్రాస్ కలెక్షన్ లు మాత్రమే వసూలు అయినట్లు తెలుస్తోంది. ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు.

మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమాకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ధమాకా మరియు 18 పేజెస్ మూవీతో పోటీ ఎదురు కానుంది. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల భారీ అంచనాలు నిలకోని ఉన్నాయి. దానితో లాటి మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు మరింత తక్కువ కలెక్షన్ లు నమోదు అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి చివరగా లాఠీ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: