వెటరన్ యాక్టర్ కైకాల సత్యనారాయణ కన్నుమూత..!

Divya
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు కన్నుమూశారు... జానపద , పౌరాణిక , సాంఘిక , చారిత్రక వంటి ఎన్నో జ్యానర్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత పార్లమెంట్ మాజీ సభ్యుడిగా కూడా రాజకీయ రంగంలో వ్యవహరించిన ఈయన 60 సంవత్సరాల పాటు సినీ జీవితాన్ని కొనసాగించారు. మొత్తం 777 చిత్రాలలో నటించి హాస్య , ప్రతినాయక, నాయక పాత్రలను పోషించారు. తన వైవిద్య భరితమైన నటనతో నవరస నటన సార్వభౌమ అనే గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి వైవిద్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు.

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 వ తేదీన కైకాల సత్యనారాయణ జన్మించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ.. ప్రాథమిక , ప్రాథమికోన్నత విద్యను గుడివాడ,  విజయవాడలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.  1960 ఏప్రిల్ 10వ తేదీన నాగేశ్వరమ్మ తో వివాహం జరగక ఇద్దరు కూతుర్లు,  ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. వివాహానికి సరిగ్గా ఏడాది ముందు అంటే 1959లో సిపాయి కూతురు సినిమా ద్వారా ఇండస్ట్రీకి ప్రవేశించిన తర్వాత ఎక్కువగా విలన్ పాత్రలు పోషించి మెప్పించారు.

ఎన్నో పాత్రలు చేసి మరింత అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించిన కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం 4:00 గంటల సమయంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా మంచానికే పరిమితమైన కైకాల సత్యనారాయణ గత రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇంతటి గొప్ప నటుడు మరణించడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పాలి . అయితే 2020 నుంచి ప్రముఖ సినీ నటీనటులు,  దర్శకులు, నిర్మాతలు ఇలా ఎంతోమంది  స్వర్గస్తులవుతూ ఉండడం నిజంగా ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగులుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: