"దమ్కి" నుండి "ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల" వీడియో సాంగ్ విడుదల తేదీని ప్రకటించడం మూవీ యూనిట్..!

Pulgam Srinivas
మాస్కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం విశ్వక్ సేన్ మొదటగా ఆకాశవనంలో అర్జున కళ్యాణ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓరి దేవుడా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు విజయాలతో మంచి జోష్ లో ఉన్న విశ్వక్ సేన్ ప్రస్తుతం ధమ్కీ అనే పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన అందాల ముద్దుగుమ్మ నివేత పెత్ రాజ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఈ మూవీకి విశ్వక్ సేన్ దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టీజర్ ను నందమూరి నటసింహం బాలకృష్ణ విడుదల చేయగా ,  ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
 

అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అనే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల వీడియో సాంగ్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విశ్వక్ సేన్ మరియు నివేత పేత్ రాజ్ లు ఉన్నారు.  లియోన్‌ జేమ్స్ ఈ మూవీ కి మ్యూజిక్‌ ను అందిస్తుండగా ,  వన్మయి క్రియేషన్స్‌, విష్వక్సేన్ సినిమాస్‌ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: