వెంకటేష్-సౌందర్య మధ్య అలాంటి బంధం..షాకింగ్ విషయాలను బయటపెట్టిన మేకప్ మెన్..!?

Anilkumar
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొందరి కాంబినేషన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక అలా టాలీవుడ్ లో వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఎంత మంచి గుర్తింపు ఉందో మనందరికీ తెలిసిందే.వీరిద్దరూ కలిసి జంటగా నటించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే తాజాగా ఒక యూట్యూబ్ కి వెంకటేష్ పర్సనల్ మేకప్ మెన్ రాఘవ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాపింగ్ విషయాలను బయటపెట్టాడు. అయితే వెంకటేష్ తండ్రి రామానాయుడు చనిపోయిన సమయంలో ఆ భాధ నుంచి 

వెంకటేష్ కోల్పోవడానికి చాలా సమయం పట్టిందని... వారం రోజులపాటు ఇంటికి వెళ్లకపోతే ఆయన నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నానని అడిగి...నా సమాచారం తెలుసుకునే వారని.. వెంకటేష్ గారికి నేను మేకప్ చేస్తుంటే వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకునే వారిని... ఆ తండ్రి కొడుకుల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేదని... నాన్న పేరు వినిపిస్తే వెంకటేష్ కు కళ్ళు ఎర్రబడేవని... వెంకటేష్ చాలా సెన్సిటివ్ అని చెప్పుకొచ్చాడు. దాంతోపాటు వెంకటేశ్వర సౌందర్య గురించి వచ్చిన గాసిప్ స్ గురించి ఆయన మాట్లాడుతూ అప్పట్లో వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ

అనేక రకమైన వార్తలు వచ్చాయి. కానీ దాంట్లో ఎలాంటి నిజం లేదు అని చెప్పుకొచ్చాడు ఆయన. వారిద్దరి కాంబినేషన్లో ఏడు సినిమాలు చేయడం వల్ల అలాంటి గాసిప్స్ వచ్చాయని సౌందర్య గారు చనిపోయే వరకు వెంకటేష్ గారిని సార్ అని పిలిచేదని ఇక అలాంటి వార్తలను వెంకటేష్ ఏ మాత్రం పట్టించుకోడని సౌందర్య ఇంటికి వెళ్ళిన సమయంలో కూడా వెంకటేష్ గారికి నాకు భోజనం వడ్డించిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక సౌందర్య చనిపోయిన సమయంలో వెంకటేష్ చాలా బాధపడ్డాడని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: