బెదురులంక 2012 నుంచి ఈరోజు భారీ అప్డేట్..!
చావు కబురు చల్లగా , రాజా విక్రమార్క వంటి చిత్రాలు పెద్దగా విజయాన్ని అందించలేదు. దీంతో ఇప్పుడు బెదురులంక 2012 సినిమాతో భారీగా అంచనాలు రేకెత్తిస్తున్నారు కార్తికేయ. అంతేకాదు ఆయనకి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించి కార్తికేయ డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు వస్తుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ఆ అప్డేట్ ఏమిటి అనే విషయానికి వస్తే బెదురులంక 2012 సినిమా నుండి పాత్రల పరిచయాలు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు బయటికి వస్తాయని చిత్ర బృందం ప్రకటించింది. మరి ఈ సినిమాలో పాత్రలలో ఎవరు ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు అనేది తెలియాలి అంటే సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.