రామ్ చరణ్- శంకర్ సినిమాలో ముఖ్యమంత్రిగా ఆ స్టార్ హీరో...!!

murali krishna
బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు  రామ్ చరణ్. రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ చిత్రం కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా జపాన్ లో అక్కడ రికార్డులను ఆర్ఆర్ఆర్ సినిమా బ్రేక్ చేసింది. మొన్నటి వరకు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ముత్తు పేరున ఉన్న రికార్డును కూడా ఆర్ఆర్ఆర్ తన పేరుకు మార్చుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. తారక్ తో పోటీ పడి నటించాడు చరణ్. పోలీస్ ఆఫీసర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక ఇప్పుడు మరో టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనుండని టాక్ వినిపిస్తోంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ చరణ్ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: