అవతార్ 2: మూడింతల లాభాలతో న్యూ రికార్డ్?

Purushottham Vinay
ఇక సరిగ్గా 13 ఏళ్ల క్రితం 2009 వ సంవత్సరంలో వచ్చిన 'అవతార్' చిత్రం ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమా వేల కోట్లు కలెక్ట్ చేసింది.ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'అవతార్ 2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్)  సినిమా పై కూడా ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ఎంతగానో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను బాగా ఫిదా చేస్తుందనే చెప్పాలి. మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా జనం ఈ చిత్రాన్ని బాగా చూస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో అయితే  మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ ని సాధించింది.ఇక రెండో రోజు, మూడో రోజు కూడా అవతార్ 2  మూవీ కలెక్షన్స్ అదిరిపోయాయనే చెప్పాలి.

ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే..'అవతార్ 2' (అవతార్ ది వే ఆఫ్ వాటర్) సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో కూడా రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో రూ.7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి వీకెండ్ ముగిసేసరికి ఏకంగా రూ.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.దీంతో   బయ్యర్లకి ఈ సినిమా రూ.19 కోట్ల భారీ లాభాలను అందించడం జరిగింది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 'అవతార్ 2' సినిమాకి ఈ రేంజ్లో ఓపెనింగ్స్ రావడం అంటే అసలు మామూలు విషయం కాదు.మరి వీక్ డేస్ లో ఈ సినిమా ఎలాంటి వసూళ్ళని కలెక్ట్ చేస్తుందో చూడాలి.ఇక ప్రపంచవ్యాప్తంగా 3600 కోట్ల దాకా వసూళ్లు రాబట్టినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: