అన్ స్టాపోబుల్ 2 : చిరంజీవితో పాటు వచ్చేది ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భోళా శంకర్ అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది వరకే చిరంజీవి , తమన్నా కాంబినేషన్ లో సైరా నరసింహా రెడ్డి మూవీ తెరకెక్కింది. ఇది వీరిద్దరీ కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో  కెరియర్ ముందుకు సాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరి కొన్ని రోజుల్లో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో కు గెస్ట్ గా రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లోని టాక్ షో కు చిరంజీవి తో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ వి వి వినాయక్ రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: