విశాల్ "లాఠీ" మూవీ ఏకంగా అన్ని నిమిషాలు ఒకే బిల్డింగ్ లో..!

Pulgam Srinivas
తమిళ సినీ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి విశాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాల్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా విశాల్ "అభిమన్యుడు" మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తెలుగు లో కూడా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విశాల్ తన గుర్తింపు ను మరింత గా పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా విశాల్ "సామాన్యుడు" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే విశాల్ తాజాగా లాఠీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి విశాల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. లాఠీ మూవీ గురించి విశాల్ మాట్లాడుతూ ... ఈ మూవీ లోని లాస్ట్ 45 నిమిషాల సన్నివేశాన్ని ఒకే బిల్డింగ్ లో చిత్రీకరించినట్లు విశాల్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో విశాల్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: