ఈ సంవత్సరం "ఐఎంబిడి" లో అత్యధిక రేటింగ్ ను అందుకున్న తెలుగు సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటికే ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ లను సాధించగా , మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ సంవత్సరంలో విడుదల అయిన తెలుగు మూవీ లలో కొన్ని తెలుగు మూవీలకు "ఐ ఎం బి డి" సంస్థ వారు అదిరిపోయే రేటింగ్ ను కూడా ఇచ్చారు. అందులో భాగంగా ఈ సంవత్సరం విడుదల అయిన తెలుగు మూవీ లలో "ఐ ఎం బి డి" సంస్థ వారు అత్యధిక రేటింగ్ ను ఇచ్చిన 6 తెలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం.


హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి "ఐ ఎం బి డి" సంస్థ వారు 8.6 రేటింగ్ ఇచ్చారు. అడవి శేషు హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ మూవీ కి "ఐ ఎం బి డి" సంస్థ వారు 8.2 రేటింగ్ ఇచ్చారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి "ఐ ఎం బి డి" సంస్థ వారు 8 రేటింగ్ ఇచ్చారు. నిఖిల్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ కి "ఐ ఎం బి డి" సంస్థ వారు 7.9 రేటింగ్ ఇచ్చారు  నాని హీరో గా నజ్రియా హీరోయిన్ గా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ కి "ఐ ఏం బి డి" సంస్థ వారు 7.6 రేటింగ్ ఇచ్చారు. విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన ఆకాశవనంలో అర్జున కళ్యాణ మూవీ కి "ఐ ఎం బి డి" సంస్థ వారు 7.4 రేటింగ్ ను ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: