"ధమాకా" మూవీ ట్రైలర్ విడుదలకు కు అంతా రెడీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా ధమాకా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరో సారి ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 15 వ తేదీన సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల మంచి అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం రవితేజ  రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఖిలాడి మూవీ తో మరియు శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక పోయాయి. మరి ధమాకా మూవీ తో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడో తెలియాలి అంటే డిసెంబర్ 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: