ప్రిన్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆ సినిమా రీ రిలీజ్..

Satvika
మహేష్ బాబు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు భారీ హిట్ అందుకున్న సినిమాలు ఇప్పుడు మళ్ళీ రీ రీలిజ్ అవుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు చిత్రాలు మళ్లీ విడుదలై సందడి చేశాయి. మహేష్‌ బాబు నటించిన పోకిరీ చిత్రం మళ్లీ థియేటర్ల లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌ హీరోగా నటించిన మరో చిత్రం ‘ఒక్కడు’ కూడా వెండి తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.

మహేష్‌ కెరీర్‌ లో ఒక్కడు చిత్రాని కి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003 జనవరిలో విడుదలైన ఈ అప్పట్లో ఓ సంచనలం. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ రికార్డు సెట్టర్‌ గా నిలిచింది. భూమిక హీరోయిన్‌ గా, ప్రకాశ్‌ రాజ్‌ విలన్‌ పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే ఈ విడుదలై 20 ఏళ్లు గడుస్తోన్న నేపథ్యం లో మళ్లీ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఒక్కడు మూవీని రీ రిలీజ్‌ చేయనున్నారు.

2023 జవవరి 7వ తేదీన ఒక్కడు చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భరీ ఎత్తున ను విడుదల చేయడానికి ఇప్పటికే ప్లానింగ్స్‌ మొదలు పెట్టారు. ఇదిలా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పూజా కార్యక్రమాల తో మొదలైంది.కానీ మొదటి షెడ్యూల్ పూర్తీ అవ్వగానే ఎన్నో సమస్యలు వస్తున్నాయి.. ఇప్పుడు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ షూటింగ్ ఎప్పుడూ మొదలవుతుందో ఎప్పుడూ విడుదల అవుతుందో చూడాలి.. ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ సినిమా తర్వాత రాజమౌలి తో సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: