"కార్తికేయ 2" మూవీ తర్వాత భయం పెరిగింది... నిఖిల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మూవీ ... మూవీ కి తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ మూవీ తో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న నిఖిల్ ఆ తర్వాత స్వామి రారా , కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా  తాజాగా కార్తికేయ 2 మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం నిఖిల్ "కార్తికేయ 2" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ,  శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష  ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఈ మూవీ ద్వారా నిఖిల్ కు నార్త్ ఇండియా లో కూడా మంచి గుర్తింపు లభించింది. తాజాగా నిఖిల్ "18 పేజెస్" అనే మూవీ లో హీరో గా నటించాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి ఏడు రంగుల వాన సాంగ్ విడుదల సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ ... తాను నటించిన కార్తికేయ 2 కంటే ఇది లోతైన సబ్జెక్ట్ అని చెప్పుకొచ్చాడు. కార్తికేయ 2 మూవీ తర్వాత తన ఫ్యూచర్ సినిమాలపై భయం ,  బాధ్యత పెరిగాయని అయితే ప్రతి సినిమాను బాధ్యతతో చేస్తున్నట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: