Bigboss6:14 వరాలకి ఇనాయ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలిస్తే షాకే..!?

Anilkumar
మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్  సీజన్ 6 ప్రస్తుతం ఎంత రసంతరంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం 6 మంది మాత్రమే ఉన్నారు. వారిలో కీర్తి, శ్రీహాన్, శ్రీ సత్య ,ఆదిరెడ్డి ,రేవంత్ ,రోహిత్ లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం టాప్ 5లో ఖచ్చితంగా రేవంత్ కి ఇనాయా సుల్తానా గట్టిపోటీ ఇస్తుంది అని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే అందరూ వీరికి ఓటు కూడా వేయడం జరిగింది. అయితే తాజాగా ఊహించని విధంగా ఈమె 14 వ వారం ఎలిమినేట్ అయ్యింది .

అయితే ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న ఆడవారిలో పోల్చుకుంటే ఈమెని బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. కీర్తి అయితే సెంటిమెంట్ తోనే ఎక్కువగా హైలెట్ అవుతుంది .ఇక శ్రీ సత్య కూడా దాదాపు అదే తరహాలో తన సమస్యలను చెప్పుకుంటూ హైలెట్ అవుతుంది అని చెప్పాలి. కానీ ఇనాయ మాత్రం ప్రతి టాస్క్ లో అబ్బాయిలతో పోటీ పడుతూ బెస్ట్ ఇస్తుంది. ప్రేక్షకుల అభిమానాలను పొందుతూ మొదట్లో రాంగోపాల్ వర్మ సపోర్ట్ తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీని దక్కించుకుంది అని చెప్పాలి.

రాంగోపాల్ వర్మ స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా  సపోర్ట్ చేయండి అంటూ పోస్ట్ కూడా చేసాడు. ఈ రకంగా ఇనాయాకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. దీంతోపాటు ఆమె ఆట తీరు చూసి మెచ్చిన ప్రేక్షకులు సైతం ఆమెకి బాగా ఓట్స్ వేశారు. ఇప్పుడు ఊహించిన విధంగా ఆమె ఎలిమినేట్ అయ్యింది .దీంతో ఇనాయ రేవంత్ రోహితులకు పోటీగా వినయ వస్తుంది అని ఎలిమినేట్ చేశారు అంటూ ఈమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈమె బిగ్ బాస్ హౌస్ లో 14 వారాలకు గాను ఎంత పారితోషకం తీసుకుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇనాయా 14 వారాలకు గాను వారానికి పదిహేను వేల రూపాయల చొప్పున 14 వారాలకు రెండు లక్షల పదివేల రూపాయలను తీసుకుందట .అందరితో పోల్చుకుంటే వినాయకి పెద్ద అమౌంట్ వచ్చింది అని అంటున్నారు నెటిజన్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: