చిరు, బాలయ్యలకి ఇది పెద్ద అవమానమే?

Purushottham Vinay
ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి టాలీవుడ్ సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' ఇంకా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.ఇక ఈ రెండు సినిమాలకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా థియేటర్లు దక్కడం లేదనే కామెంట్ లు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.అవే నిజం కూడా.ఇది ఒకింత మన సీనియర్ హీరోలను అవమానించినట్లే.అయితే దీనిపై తాజాగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ ఘాటుగా స్పందించడం జరిగింది. సంక్రాంతి పండుగ బరిలో దిగుతున్న సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ చిత్రాలకు థియేటర్లు ఇవ్వకపోవడం నిజంగా సోచనీయమని సి. కల్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేస్తున్న ఈ ఇద్దరు సీనియర్ అగ్రహీరోలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవమానించడమేనని ఆయన చాలా మండిపడ్డారు. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందించాలని ఆయన అన్నారు.


పండగ సీజన్ లలో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధనకు కట్టుబడి వుండాలని ఈ సందర్భంగా సి. కల్యాణ్ గుర్తు చేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగల సమయంలో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనువాద సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకాదనే నిర్ణాయాన్ని గతంలో తీసుకున్నామని అన్నారు.ఇక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 'తెలుగు నిర్మాతల మండలి ఎగ్జిబిటర్లకు ఈ విషయంలో విజ్ఞప్తి చేసింది. ఈ విషయం పరిశ్రమలో చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారిందన్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' సినిమాలతో పాటు దిల్ రాజు తమిళంలో నిర్మిస్తున్న 'వారీసు' తెలుగులో 'వారసుడు'గా విడుదల అవుతోంది. అయితే దిల్ రాజు తాను నిర్మిస్తున్న'వారసుడు' సినిమాకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ధియేటర్లని కేటాయిస్తున్నాడని వాదన బయటికి రావడంతో తెలుగు నిర్మాతల్లో భయాందోళన అనేది మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: