ఏంటి.. రజనీకాంత్ అరుణాచలం.. బాలయ్య సినిమాకు కాపీనా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వస్తూనే ఉంటాయి. అయితే ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని సినిమాల స్టోరీలు మాత్రం కాస్త అటు ఇటుగా ఒకేలాగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అయితే పాతకాలం నాటి సినిమా స్టోరీలను కొత్త హంగులు అద్ది మళ్లీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్న దర్శకులు సూపర్ హిట్లు కూడా అందుకుంటున్నారని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియా యుగంలో ఏ సినిమాలోనైనా ఒక సీన్ మరొక సినిమాలో సన్నివేశంతో పోలి ఉంది అంటే చాలు ఆ విషయాన్ని  వెంటనే పసిగట్టేస్తున్నారు ప్రేక్షకులు.

 1997లో ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుణాచలం సినిమా కూడా ఏకంగా టాలీవుడ్ హీరో బాలయ్య సినిమాకు కాపీ అంటూ ఒక చర్చ ప్రస్తుతం మొదలైంది. రజనీకాంత్ హీరోగా వచ్చిన అరుణాచలం సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ సౌందర్య రంభ కలిసి నటించిన ఈ సినిమా 1997 ఏప్రిల్ పదిన రిలీజ్ అయింది. సినిమాలో రజనీకాంత్ కు తన తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకుంటాడు  30 రోజుల్లో 30 కోట్లు ఖర్చుపెట్టి 3000 కోట్ల సంపదకు వారసుడు కావడం ఒక ఛాలెంజ్.. 30 కోట్లు తీసుకుని తన దారిన తాను వెళ్లిపోవడం రెండో చాలెంజ్..

 ఇక కథ మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా జరగడానికి 22 సంవత్సరాల క్రితమే నటసింహం బాలకృష్ణ హీరోగా ఇదే కథతో ఒక సినిమా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన బాబాయ్ అబ్బాయి సినిమాలో బాలయ్యకు జోడిగా కృష్ణవేణి, అనిత రెడ్డిలు హీరోయిన్లుగా నటించారు.. ఈ సినిమాలో సుత్తి వేలు 25 లక్షల రూపాయలు ఇస్తాడు. దానం చేయకుండా ధ్వంసం చేయకుండా పారేయకుండా ఆ డబ్బును 30 రోజుల్లో ఖర్చు చేయాలని శరతు పెడతాడు. ఇక ఈ సినిమాలో కూడా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతుంటే సంపద అంతకంతకు పెరుగుతూ వస్తుంది.  ఇలా ఖర్చు పెట్టడంలో అబ్బాయి ఫెయిల్ అయిన వరప్రసాద్ అతని నిజాయితీకి మంచి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీన్ని తర్వాత జనరేషన్ కు అనుగుణంగా మార్చి సి సుందర్ రజనీకాంత్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: