ట్రెడిషనల్ డ్రెస్ లో క్లాస్ లుక్స్ తో మైమరిపిస్తున్న హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కుమారి 21 ఎఫ్ మూవీ తో మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటించినప్పటికీ సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు.
 

కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ రామ్ హీరో గా తెరకెక్కిన రెడ్ మూవీ లో ఐటెం సాంగ్ లో నటించింది. తాజాగా హెబ్బా పటేల్ "ఓదెల రైల్వే స్టేషన్" మూవీ లో డీ గ్లామరైజ్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా సినిమా లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అల్లరిస్తున్న ఈ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని సార్లు ఈ ముద్దు గుమ్మ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 

తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హెబ్బా పటేల్ బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  పర్పుల్ కలర్ లో ఉన్న చున్నీ ని ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: