అంతర్మధనంలో హరీష్ శంకర్ !

Seetha Sailaja
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో వేచి చూస్తూ ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోష్టర్ ను విడుదల చేయగానే ఆ టైటిల్ తో కనెక్ట్ అయిపోయిన పవన్ అభిమానులు ఆసినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ మూవీ తరువాత పవన్ ఎందరో దర్శకుల సినిమాలలో నటించాడు కానీ పవన్ అభిమానులు కోరుకునే హరీష్ శంకర్ కాంబినేషన్ కు మరొకసారి ఓకె చెప్పలేదు.

అయితే పవన్ అభిమానులు మాత్రం హరీష్ శంకర్ తో తమ పవర్ స్టార్ మూవీ ఉండాలని విపరీతంగా కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో పవన్ తో హరీష్ శంకర్ సినిమా ఉంటుంది అని ప్రకటన వచ్చినా అది అభిమానులకు ఏమాత్రం నచ్చడంలేదు. దీనికికారణం హరీష్ పవన్ తో ‘తేరి’ రీమేక్ మొదలుపెడుతున్నాడు అని లీకులు రాగానే పవన్ అభిమానులు అసహనంతో రెచ్చిపోయి వేల సంఖ్యలో నిరసన ప్రకటిస్తూ అభిమానులు పోస్టులు మీమ్స్ పెట్టారు.

పవన్ అభిమానులు ప్రవర్తించడం వెనుక ఒక కారణం కూడ ఉంది. ‘తేరి’ మూవీ తెలుగులో ‘పోలీసోడు’ మూవీగా డబ్ చేసి విడుదల చేసారు. ఈమూవీని ఇప్పటికీ అనేక ఛానల్స్ వారానికి రెండు సార్లు ఎక్కడో అక్కడ ప్రసారం చేస్తూనే ఉంటాయి. దీనికితోడు ఈమూవీ అమెజాన్ ప్రైమ్ లో కూడ ఎప్పటి నుంచో స్ట్రీమ్ అవుతోంది.  

ఇలా అందరు ఒకటికి పదిసార్లు చోసిన మూవీని హరీష్ శంకర్ పవన్ తో కొత్తగా ఏమి తీస్తాడు అంటూ అభిమానులు పడుతున్న ఆవేదన హరీష్ శంకర్ దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈమూవీ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేస్తే మళ్ళీ పవన్ ను ఒప్పించే మరోకథ గురించి ఆలోచించాలి. ఇలా ఆలోచనలతో నెలలు గడిచిపోతే పవన్ కు మళ్ళీ మనసు మారిపోయి హరీష్ శంకర్ మూవీని పక్కకు పెట్టే పరిస్థితి ఏర్పడితే అతడి పరిస్థితి ఏమిటి అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ ఈ దర్సకుదుని అంతర్మధనంలో పడేస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: