గుర్తుందా సీతాకాలం: ప్రేక్షకులకు గుర్తుండిపోతుందా?

Purushottham Vinay
టాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా కలిసి ఫస్ట్ టైం జంటగా నటించిన చిత్రం గుర్తుందా సీతాకాలం.నేడు ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథంతా కూడా రోడ్‌ జర్నీలో పరిచమైన ఇద్దరు వ్యక్తులు దేవ్‌(సత్యదేవ్‌), దివ్య (మేఘా ఆకాష్‌) మధ్య సంభాషణగా నడుస్తుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన దేవ్‌ తన స్కూల్‌, కాలేజీ డేస్‌లలో ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే స్కూల్‌ డేస్‌లోది అట్రాక్షన్‌. కానీ కాలేజీలో అమ్ము అలియాస్ అమృతని (కావ్యా శెట్టి) అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. ఇక ఆమె కోసం ఏకంగా బెంగళూరు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు.అయితే అతని శాలరీ తక్కువని ఇక ధనవంతులుగా ఉన్న మనం అలాంటి వారితో లైఫ్ ని లీడ్ చెయ్యలేమని తల్లి చెప్పడంతో అమ్ము మనసు మారుతుంది. ఇక అప్పటినుండి ప్రతిసారి దేవ్‌ని తక్కువ చేసి మాట్లాడుతుంది. పాపం ఎన్నో సార్లు అవమానిస్తుంది. అయినా కూడా దేవ్‌ అసలు ఆమెను ఒక్కమాట అనడు. ఆ తరువాత ఆమే దేవ్‌కి బ్రేకప్‌ చెబుతుంది. ఆ తర్వాత దేవ్‌ లైఫ్ లోకి నిధి(తమన్నా) వస్తుంది. నిధిని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి లైఫ్ లో జరిగిన పరిణామాలు ఏంటి? అసలు నిధికి అబార్షన్‌ ఎందుకు అయింది? తరువాత దేవ్‌ ప్రేమ,పెళ్లి విషయంలో స్నేహితులు ప్రశాంత్‌(ప్రియదర్శి), గీతుల పాత్ర ఏంటి? అసలు దేవ్ తన లవ్‌స్టోరీని అపరిచితురాలైన దివ్యకు ఎందుకు చెప్పాడు? అన్నది మిగతా కథ.


కన్నడలో హిట్ అయిన లవ్ మాక్‌టెయిల్ తెలుగు రీమేకే గుర్తుందా శీతాకాలం. తెలుగు నేటివిటికి తగినట్టు సినిమాలో కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు. ఇలాంటి ప్రేమ కథలు ఎన్ని వచ్చినా కానీ వాటిపై అసలు ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ తగ్గదు. అయితే తెరపై చూపించే లవ్‌స్టోరీతో ప్రేక్షకుడు కనెక్ట్‌ అయితే అది ఖచ్చితంగా వర్కౌట్‌ అవుతుంది. ఆ పాత్రల్లో లీనమైపోవాలి. కథ కూడా ఫ్రెష్‌గా ఉండాలి. అలాంటి లవ్‌స్టోరీనే ఆడియన్‌ ఖచ్చితంగా తన ఓన్‌ చేసుకుంటాడు. కానీ గుర్తుందా శీతాకాలంలో మాత్రం ఆ పాయింట్ మిస్‌ అయింది.కొత్తదనం అసలు ఏమి కనిపించదు. హీరోకి స్కూల్‌డేస్‌ ఇంకా కాలేజీ డేస్‌ లవ్‌స్టోరీ ఉండడం..తరువాత వాటిని నెమరేసుకోవడం ఇలాంటి కథలు తెలుగు ఆడియన్స్‌కు కొత్తేమి కాదు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'ప్రేమమ్' సినిమాల లాగా కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే స్కూల్‌ డేస్‌ ఇంకా కాలేజీ డేస్‌ సీన్స్‌ నవ్విస్తాయి. అయితే కథనం మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో సత్యదేవ్‌ ఇంకా తమన్నాల మధ్య జరిగే సీన్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. బలమైన సీన్స్ ఏవి లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం సినిమాకి పెద్ద మైనస్‌. ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: