ఆ హీరో గురించి మంచు లక్ష్మీ ఏమందో తెలుసా?

Satvika
మంచు లక్ష్మీ గురించి ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు.. ప్రొడ్యూసర్ గానే కాకుండా అడపాదపా ల్లో నటించి అలరిస్తున్నారు మంచు లక్ష్మీ. లతోపాటుగానే పలు షోలు కూడా హోస్ట్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ నటించిన మాన్ స్టర్.ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ మూవీలో మంచు లక్ష్మీ కీలక పాత్రలో కనిపించరు. మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు వైసక్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు..

ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ లో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు లో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు అని అన్నారు.. భాష పరంగా ఇబ్బందులు పడ్డాను. ఆ డైలాగ్స్ మనలా ఉండవు, చాలా లెంగ్తీ డైలాగ్స్ ఇచ్చారు. నేను చాలా ఎనర్జిటిక్ గా సెట్స్ కు వెళ్తే, డల్ గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది అన్నారు.

ఇక మోహన్ లాల్ ఒక లెజెండరీ నటుడు. ఆయన నటుడిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. ఇప్పటికీ తన కెరీర్ లో చాలెంజింగ్ మూవీస్ చేస్తున్నారు. మీతో సంవత్సరానికి ఒక లో అయినా నటించాలని ఉందని నేను ఆయనతో అన్నాను. కెరీర్ లో ఇప్పుడు ఆయన ఉన్న స్జేజ్ లో నాకెందుకు ఇలాంటి సబ్జెక్ట్ అనుకోవచ్చు కానీ ఆయన సవాళ్లు స్వీకరిస్తారు.అంటూ ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు..ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని అన్నారు. అదేవిధంగా ట్రోల్స్ ను, మీమ్స్ ఎంజాయ్ చేస్తుంటా.. వాళ్లకు ఇంకేదేనా కొత్తగా క్రియేట్ చేసేందుకు క్లూ ఇవ్వాలని చూస్తుంటా.. నటిగా కంటే టీవీ కార్యక్రమాల్లో నన్ను నేనుగా ప్రేక్షకులకు చూపించుకోగలుగుతాను. ప్రస్తుతం గాంబ్లర్, లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం వంటి సినిమాల్లో నటిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: