రివైండ్ 2022: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన తెలుగు మూవీస్ ఇవే..!

Divya
2022 సంవత్సరానికి గాను బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఆర్ ఆర్ ఆర్:
రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణ సారధ్యంలో రామ్ చరణ్,  ఎన్టీఆర్ సంయుక్తంగా కలిసి నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. 2022 మార్చి 24న విడుదలైన ఈ సినిమా రూ.550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి  బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు వసూలు చేసింది.
బంగార్రాజు:
సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ గా  కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాతగా.. నాగచైతన్య,  నాగార్జున హీరోలుగా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు . జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
డీజే టిల్లు:
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ తెరకెక్కించిన చిత్రం ఇది . 2022 ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టించింది.
మేజర్:
26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్,  సూపర్ స్టార్ మహేష్ బాబు జి ఎం బి ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మించారు.  ఈ సినిమా 2022 మే 24న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

బింబిసారా:
క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడి కథ నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించగా ఈ సినిమాకు శ్రీ వశిష్ట దర్శకత్వం వహించారు.  2022 ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక వీటితోపాటు సీతారామం,  హిట్ 2 , కార్తికేయ 2,  యశోద, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: