2022 లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన తెలుగు చిత్రాలు ఇవే..!

Divya
2022 సంవత్సరానికి గాను తెలుగు చిత్రాలు భారీ స్థాయిలో విడుదలై ప్రపంచ స్థాయిలో రికార్డులు సాధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన తెలుగు చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం..
1. RRR:
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇప్పటికీ సినిమా హవా తగ్గడం లేదు. అంతేకాదు ప్రపంచ స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఏకైక తెలుగు చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది.
2. మేజర్:
 శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడిన ఆయన జీవిత ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి భారీ కలెక్షన్స్ వసూలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్లతో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది.
3. సీతారామం:
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా తెరకెక్కించిన యుద్ధంతో రాసిన ప్రేమ కథా చిత్రం సీతారామం.  అన్ని భాషలలో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా..
4. డీజే టిల్లు:
చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను కలెక్షన్స్ తో షేక్ చేసింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా తెరకెక్కించిన ఈ సినిమాల్లో సిద్దు తెలంగాణ యాస ప్రేక్షకులను కట్టిపడేసింది.  నేహా శెట్టి రొమాన్స్ యువతను ఆకట్టుకుంది . మొత్తానికి అయితే చిన్న సినిమాగా విడుదల అయ్యి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా.
5. శ్యామ్ సింగరాయ్:
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
6. కార్తికేయ-2:
చందు మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా.. అనుపమ హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: