"నీవెవరు" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ ఎంతంటే..?

Pulgam Srinivas
కోలా బాలకృష్ణ , సాక్షి చౌదరి హీరో , హీరోయిన్ లుగా తాజాగా నీవెవరు అనే మూవీ తేరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. భీమినేని శివప్రసాద్ , తన్నీరు రాంబాబు ఈ మూవీ ని నిర్మించగా , నిర్ణయ్ పల్నాటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం లో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్ , తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన నేనెవరు డిసెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేయగా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.

లవ్ , సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ కి పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధగోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ మూవీ  ద్వారా సంగీత దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. రాజా రవీంద్ర , దిల్ రమేష్ , డి.ఎస్.రావు తాగుబోతు రమేష్ , వేణుb, సుదర్శన్ రెడ్డి , నీరజ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తుంది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా చిత్ర బృందం లాక్ చేసింది. ఈ మూవీ 2 గంటల 2 నిమిషాల మామూలు నడిపి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: