మహేశ్ బాబు అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్..ఏంటంటే..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో " SSMB28 " వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది.అయితే  ఆ తరువాత మహేశ్ తన తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోవడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇక అన్నీ సవ్యంగా జరిగితే ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రెల్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది చిత్రయూనిట్.  మహేశ్ కుటంబంలో చోటు చేసుకున్నా విషాదం కారణంగా

 ప్రాజెక్ట్ ప్లానింగ్ లో చాలానే మార్పులు చోటు చేసుకొనున్నాయి..అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్స్ పోస్ట్ పోన్ అవుతూ రావడం, షూటింగ్స్ కు బ్రేకులు పడుతుండడంతో, చిత్రం ఏప్రెల్ లో రిలీజ్ అయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా  తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీని ఆగష్టు కు పోస్టు పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగష్టు లో మహేశ్ బాబు బర్త్ డే ఉండడం అలాగే శ్రీమంతుడు గతంలో ఆగష్టు లోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలవడంతో సెంటిమెంట్ పరంగా ఆగష్టు బెటర్ అని చిత్రయూనిట్ ఆలోచిస్తుందట.

అయితే ఇదే గనుక జరిగితే SSMB28 కోసం వచ్చే ఏడాది వరకు సూపర్ స్టార్ అభిమానులు ఎదురు చూడక తప్పదు.  మహేశ్ బాబు వచ్చే నెల నుంచి షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం.ఇక  ఒక్కసారి మహేశ్ సెట్స్ లో అడుగు పెడితే.. నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.అయితే  మొత్తానికి 13 ఏళ్ల తరువాత సెట్స్ పైకి వచ్చిన ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కు వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ ముచ్చటగా మూడవసారి ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: