అక్షయ్ కుమార్ భార్యకు కూడా.. ఆ వేధింపులు తప్పలేదట.

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో అటు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేవారు కెరియర్ తొలినాళ్లలో ఎంతల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఆ తర్వాత స్టార్స్ లాగా మారిన తర్వాత తాము కెరియర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఎంతోమందికి సోషల్ మీడియా వేదికగా నిజాలు బయటపడుతూ సంచలనం సృష్టించడం లాంటివి చేస్తూ ఉన్నారు.

 సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంతో ఎక్కువగా ఉంది అంటూ ఎంతో మంది చెబుతున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్లు దర్శక నిర్మాతల మనోభావాలను కించపరచకుండా వారి ఇష్టానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో నిలవదుకునేందుకు ఇక సాదాసీదా హీరోయిన్లు కాస్త స్టార్ హీరోయిన్లుగా మారెందుకు అవకాశం ఉంటుందని ఒక వాదన ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇక ఏ మాత్రం దర్శక నిర్మాతలకు ఎదురు తిరిగిన.. చివరికి కెరియర్ మొత్తం అక్కడికి ముగిసిపోయినట్లు అవుతుందని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు.

 అయితే సాధారణ సెలబ్రిటీలకు మాత్రమే కాదు ఏకంగా స్టార్ సెలబ్రిటీలకు సైతం కొనిసార్లు వేధింపులు ఎదురవుతాయి అన్నది ఒక్కోసారి బయటపడుతూ ఉంటుంది. కాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ కన్నాకు సైతం ఇలాంటి చేదు అనుభవం ఎదురయిందట. ఒక డైరెక్టర్ ఏకంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ట్వింకిల్ కన్నా చెప్పుకొచ్చింది. ఓ రోజు లొకేషన్ లో హీరో హీరోయిన్ల మధ్య వాన సాంగ్ షూటింగ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆమె తెలుపు రంగు దుస్తులు ధరించిందట. ఆ సమయంలో డైరెక్టర్ ఆమె వద్దకు వెళ్లి శాలువా కప్పి నేను మందాకిని పాత్ర చేయమంటే ఏం చేస్తావు అని అడుగగా.. నో చెప్పిందట. నువ్వు రాజ్ కపూర్ వి కాదు అంటూ సమాధానం చెప్పిందట. రాజ్ కపుర్ దర్శకత్వంలో  తెరకెక్కిన రాజ్ తేరే గంగా మైలి సినిమాలో హీరోయిన్ మందాకిని పాత్రలో బిడ్డకు పాలు ఇచ్చే సన్నివేశాలు ప్రైవేట్ పార్ట్ కనిపించే విధంగా పలుచని చీరలో స్నానం చేస్తూ సందడి చేశారు. ఆమె తరహా లోనే ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా దుస్తులు వేసుకోమని దర్శకుడు పరోక్షంగా తనని ఇబ్బందులకు గురి చేసాడని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ట్వింకిల్ కన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: